వికారాబాద్ జిల్లా ధారూరు మండలం హరిదాస్ పల్లికి చెందిన హరీశ్ శివశంకర్ రెడ్డి ఆస్ట్రేలియాలో మృతి చెందాడు. గ్రామానికి చెందిన సాయిరెడ్డి, నాగేంద్రమ్మల కుమారుడు హారీష్ ఉన్నత చదువు కోసం అస్ట్రేలియాకు వెళ్ళాడు. సదరన్ క్రాస్ యునివర్సిటీలో పీజీ రెండో సంవత్సరం చదువుతున్నాడు.
ఆస్ట్రేలియాలో వికారాబాద్‌కు చెందిన విద్యార్థి మృతి
ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియాకు వెళ్లిన ఓ యువకుడు బాత్రూంలో పడి.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ధారూరు మండలం హరిదాస్‌పల్లికి చెందిన హరీశ్ శివశంకర్ రెడ్డి ఆస్టేలియాలో ప్రాణాలు కోల్పోయాడు.
ఆస్ట్రేలియాలో వికారాబాద్‌కు చెందిన విద్యార్థి మృతి
ఐదు రోజుల కిందట తలనొప్పితో బాధపడుతూ బాత్రూంలో పడి తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు.