తెరాస నేత, ఎంపీ జోగినిపల్లి సంతోశ్ కుమార్ పేరుతో నకిలీ ఫేస్బుక్ ఐడీతో మోసాలకు పాల్పడుతున్న బాలుడిని సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మందావురకు చెందిన బాలుడు... సంతోశ్ కుమార్ పేరుతో ఫేస్‌బుక్‌లో నకిలీ ఐడీ తయారు చేశాడు.
ఎంపీ సంతోశ్ పేరుతో ఫేక్ ఫేస్బుక్ ఐడీ... బాలుడి అరెస్టు - ఎంపీ సంతోశ్ పేరుతో ఫేక్ ఫేస్బుక్
తెరాస ఎంపీ సంతోశ్ కుమార్ పేరిట నకిలీ ఫేస్బుక్ ఐడీ సృష్టించి మోసాలకు పాల్పడుతున్న బాలుడిని సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. యూపీకి చెందిన ఓ బాలుడు.. సంతోశ్ పేరుతో ఐడీ క్రియేట్ చేసి డబ్బులు అవసరమని ఎంపీ స్నేహితలకు మెసేజ్ చేశాడు. అనుమానం వచ్చిన స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది.
mp santhosh
ఎంపీ స్నేహితులతో తనకు యాభై వేల రూపాయలు అవసరమని... తన స్నేహితుడి కుమార్తె వైద్య అవసరాల కోసం ఈ మొత్తాన్ని గూగుల్ పే ద్వారా చెల్లించాలని కోరాడు. అనుమానం వచ్చిన సంతోశ్ స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టగా యువకుడి మోసాలు వెలుగులోకి వచ్చాయి.
ప్రముఖుల వివరాలు సేకరించి వారి పేరిట నకిలీ ఐడీలు సృష్టించి ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించిన పోలీసులు... నిందితుడిని అరెస్టు చేశారు.