పానీపూరీ తినేందుకు వెళ్లి గల్లంతైన యువకులు మృతి - పానీపూరీ
12:10 October 15
పానీపూరీ తినేందుకు వెళ్లి గల్లంతైన యువకులు మృతి
హైదరాబాద్ ఇంజాపూర్ వద్ద గల్లంతైన ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. తొర్రూర్ రాజీవ్ గృహకల్పలో నివాసం ఉంటున్న ప్రణయ్(16), జయదీప్(19) ఇంజాపూర్‌లో పానీపూరీ తినేందుకు బుధవారం బయటికి వెళ్లారు. ప్రమాదవశాత్తు తుర్కయంజాల్ చెరువు ప్రవాహంలో కొట్టుకుపోయారు. యువకులు ఇంటికి తిరిగిరాకపోవడం వల్ల కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు గాలింపు చేపట్టగా ఇంజాపూర్ వద్ద వాగులో ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి.
ఇదీ చదవండి:విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి.. విషాదంలో కుటుంబీకులు