తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

రాయపోల్​లో రోడ్డు ప్రమాదం... ఒకరు మృతి - రాయపోల్​లో రోడ్డు ప్రమాదం

ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లా చిన్నమాసాన్​పల్లి స్టేజి సమీపంలో జరిగింది. ప్రమాదంలో మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.

రాయపోల్​లో రోడ్డు ప్రమాదం... ఒకరు మృతి
రాయపోల్​లో రోడ్డు ప్రమాదం... ఒకరు మృతి

By

Published : Oct 29, 2020, 10:24 AM IST

సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం చిన్న మాసన్​పల్లి స్టేజి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వచ్చిన రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. దౌల్తాబాద్ మండలం తిరుమలాపూర్​కు చెందిన ఎరుకలి పోశయ్య... ద్విచక్రవాహనంపై గజ్వేల్​కు వెళ్తుండగా, గజ్వేల్​ నుంచి వస్తున్న మరో వాహనం పోశయ్యను ఢీకొట్టింది.

ఈ ఘటనలో పోశయ్య ప్రమాదస్థలిలోనే మృతి చెందాడు. సమాచారం అందుకున్న రాయపోల్​ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్​ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఇదీచూడండి:వికారాబాద్​లో గుర్తు తెలియని వివాహిత దారుణ హత్య

ABOUT THE AUTHOR

...view details