వనపర్తి పట్టణ శివారులోని జెర్రిపోతుల మైసమ్మ ఆలయం సమీపంలో గల వాగులో ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. గోపాల్పేట మండలం ఏదుల గ్రామానికి చెందిన కొందరు వనపర్తి నుంచి వారి గ్రామానికి వెళ్లే క్రమంలో ఐదుగురు ఒకరి చేతులు ఒకరు పట్టుకొని వాగు దాటుతుండగా బుచ్చిరెడ్డి, గోవింద్ వాగులో పడిపోయారు. చూస్తుండగానే వారు కనుమరుగైనట్లు స్థానికులు పేర్కొన్నారు. పోలీసులు, గ్రామస్థులు గాలించినప్పటికీ వారి ఆచూకీ దొరకలేదు.
వాగు దాటుతుండగా ప్రమాదం.. ఇద్దరు గల్లంతు - wanaparthy latest news about floods
వరద ఉద్ధృతి వల్ల వాగు దాటుతున్న ఇద్దరు వ్యక్తులు కొట్టుకుపోయిన ఘటన వనపర్తి పట్టణ శివారులోని జెర్రిపోతుల మైసమ్మ ఆలయం సమీపంలో జరిగింది. ఏదుల గ్రామానికి చెందిన ఐదుగురు వాగు దాటుతుండగా... ఇద్దరు ప్రవాహంలో కొట్టుకుపోయారు. మరో ఘటనలో చెన్నూరు గ్రామ సమీపంలో ఓ యువకుడు ద్విచక్రవాహనంపై వాగు దాటుతుండగా ప్రమదవశాత్తు కొట్టుకుపోయాడు. గుర్తించిన స్థానికులు యువకుడిని కాపాడారు.
వాగు దాటుతుండగా ప్రమాదం.. ఇద్దరు వ్యక్తుల గల్లంతు
బైక్‌పై వెళ్లే యువకుడు జారి వాగులో పడిపోయాడు. మోటర్ సైకిల్ నీళ్లలో కొట్టుకుపోయినప్పటికీ యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. రేవల్లి మండలం చెన్నూరు గ్రామ సమీపంలో నాగరాజు వాగును మోటార్ సైకిల్‌పై దాటుతుండగా ప్రమాదవశాత్తు జారి వాగులో పడిపోయాడు. వరద ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో నీటితోపాటు కొట్టుకుపోయి మధ్యలో చిక్కుకుపోయాడు. చెట్టును ఆసరాగా చేసుకుని అలాగే ఉండడంతో గమనించిన గ్రామస్థులు తాడు సహాయంతో నాగరాజుని కాపాడారు.