వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం చింతపల్లి గేట్ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్ ద్రిచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.
బొమ్మరాసిపేట మండలం కొత్తూరు గ్రామానికి చెందిన కురువ పెద్ద మల్లప్ప, కురువ రాములు బావ, బావమరుదులు. చెట్లపల్లి గ్రామంలో తమ బంధువుల ఫంక్షన్కు ఇద్దరూ ద్విచక్రవాహనంపై వెళ్లి వస్తుండగా.. చింతపల్లి గేట్ సమీపంలో ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి.. అటు పక్క నుంచి వెళ్తున్న ట్రాక్టర్ కింద పడ్డారు. ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.