రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. నాగర్కర్నూల్ జిల్లా ఆమ్రాబాద్ మండలం ఈగలపెంట వద్ద నల్లమల అడవిలో రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీశైలం-హైదరాబాద్ హైవేపై ఆక్టోపస్ వ్యూ పాయింట్ వద్ద కార్లు పరస్పరం ఢీకొన్నాయి.
శ్రీశైలం హైవేలో రెండు కార్లు ఢీ...ఇద్దరి పరిస్థితి విషమం - శ్రీశైలం హైవేలో రోడ్డు ప్రమాదం
నాగర్కర్నూల్ జిల్లా ఆమ్రాబాద్ మండలం ఈగలపెంట వద్ద రెండు కార్లు ఢీకొన్న ఘటనలో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. శ్రీశైలం- హైదరాబాద్ హైవే నల్లమల అడవిలో ఎదురెదురుగా వస్తున్న కార్లు అదుపుతప్పి ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను దగ్గరలోని జెన్కో ఆస్పత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
శ్రీశైలం హైవేలో రెండు కార్లు ఢీ...ఇద్దరి పరిస్థితి విషమం
క్షతగాత్రులను సమీపంలోని జెన్కో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గురైన వారిని హైదరాబాద్ వాసులుగా భావిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.