కత్తితో బెదిరిస్తూ... దోపిడీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను మధ్యమండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌లోని మంగళ్‌హాట్ ప్రాంతానికి చెందిన షైక్ యసీన్ పటేల్, మహమ్మద్ ఫర్హాన్లను అరెస్ట్ చేసి... వారి నుంచి రెండు మొబైల్ ఫోన్లు, ఒక కత్తి, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
కత్తితో బెదిరిస్తూ దోపిడీలకు పాల్పడుతున్న దొంగలు అరెస్టు - hyderabad news
ఈ నెల 2న మాసబ్ ట్యాంక్ వద్ద ఆటో డ్రైవర్‌ను కత్తితో బెదిరించి సెల్‌ఫోన్ ఎత్తుకెళ్లిన దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల దగ్గర నుంచి రెండు మొబైల్ ఫోన్లు, ఒక కత్తి, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
two accused arrested in robbery case in mangal hot
విలాసవంతమైన జీవనానికి అలవాటు పడి... మద్యానికి బానిసైన ఇద్దరు యువకులు ఈజీ మనీ కోసం ఈ దొంగతనాలకు పాల్పడినట్లు టాస్క్‌ఫోర్స్ పోలీసులు వెల్లడించారు. ఈ నెల 2న మాసబ్ ట్యాంక్ వద్ద ఆటో డ్రైవర్‌ను కత్తితో బెదిరించి సెల్‌ఫోన్ ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదుతో సెంట్రల్ జోన్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. గతంలో ఇదే తరహాలో హాబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు.