షార్ట్ సర్క్యూట్‌తో టీవీ పేలి ఇల్లు దగ్ధం - TV blast in siddipet district
షార్ట్ సర్క్యూట్‌తో టీవీ పేలి ఇల్లు దగ్ధం
10:20 June 19
షార్ట్ సర్క్యూట్‌తో టీవీ పేలి ఇల్లు దగ్ధం
సిద్దిపేట జిల్లా మిరిదొడ్డి మండలం మోతె గ్రామంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఇంట్లో షార్ట్ సర్క్యూట్‌తో టీవీ పేలి మంటలు వ్యాపించాయి. వంట గ్యాస్ లీక్ అవడం వల్ల అగ్నిప్రమాద తీవ్రత పెరిగి.. ఇల్లు దగ్ధమైంది.
ఇంట్లోని వ్యక్తులు అప్రమత్తమై బయటకు పరుగులు తీశారు. ప్రాణనష్టం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది... ఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పారు.
Last Updated : Jun 19, 2020, 11:52 AM IST