పతంగి ఎగురవేస్తూ భవనం పైనుంచి పడి తెరాస కార్యకర్త మృతి - తెలంగాణ వార్తలు
20:52 January 14
పతంగి ఎగురవేస్తూ భవనం పైనుంచి పడి తెరాస కార్యకర్త మృతి
సంక్రాంతి పండగ రోజు హైదరాబాద్ చిక్కడపల్లిలో విషాదం చోటుచేసుకుంది. పతంగి ఎగరవేస్తూ ప్రమాదవశాత్తు మూడు అంతస్తుల భవనంపై నుంచి పడి... వివేక్ నగర్‌కు చెందిన తెరాస నేత బంగారు కృష్ణ మరణించాడు.
జారిపడిన సమయంలో పక్క ఇంటి ప్రహరీ గోడ ఇనుప చువ్వలు శరీరంలోకి గుచ్చుకున్నాయి. దీంతో ఆయన నా శరీరం నుంచి రక్తం తీవ్రంగా పోయింది. ఆసుపత్రికి తరలిస్తుండగా తీవ్ర రక్తస్రావంతో మార్గ మధ్యలో మృతి చెందాడు.
ఇదీ చదవండి :పేకాటలో ఉద్రిక్తం.. కోడి పందేల్లో యువకుల వివాదం