వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో ఉద్రిక్తత నెలకొంది. భాజపా కార్యాలయంపై తెరాస కార్యకర్తలు దాడి చేశారు. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై భాజపా శ్రేణులు దాడికి పాల్పడిన కొద్ది గంటలకే దాడి చేశారు. సుబేదారి పోలీస్ స్టేషన్ ముందున్న భాజపా వాహనాల అద్దాలు ధ్వంసం చేశారు.. గులాబీ శ్రేణులు.
సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటన స్థలికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. అక్కడ నుంచి తెరాస కార్యకర్తలను పంపించేశారు. దాడికి పాల్పడిన తెరాస శ్రేణులను అరెస్ట్ చేయాలని కోరుతూ భాజపా జిల్లా అధ్యక్షురాలు పద్మ.. సుబేదారి పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన చేపట్టారు.