వరంగల్ అర్బన్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కాజిపేట్ మండలం సోమిడిలో ఉదయం నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో చెట్టు కూలిపోయింది. అక్కడే ఉన్న కారుపై పడింది. గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడుగా పనిచేస్తున్న నెహ్రూ మంగళవారం విధులకు హాజరై.. తన షిఫ్ట్ కారును పాఠశాల ఆవరణలోని చెట్టు కింద నిలిపి ఉంచారు.
పాఠశాలలో చెట్టు కూలి కారు ధ్వంసం - చెట్టు కూలి కారు ధ్వంసం
ఉదయం నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో చెట్టు కూలి కారు ధ్వంసమైన ఘటన వరంగల్ అర్బన్ జిల్లా సోమిడిలో చోటుచేసుకుంది. ప్రమాదం జరిగినప్పుడు కారులో ఎవరు లేకపోడటంతో ప్రాణనష్టం జరగలేదు.
పాఠశాలలో చెట్టు కూలి కారు ధ్వంసం
ఉదయం నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షం కారణంగా చెట్టు వేర్లతో సహా కారుపై పడింది. ఈ ఘటనలో కారు వెనక భాగం పూర్తిగా దెబ్బతింది. ప్రమాదం జరిగినప్పుడు కారులో ఎవరు లేకపోవడంతో ప్రాణనష్టం జరగలేదు.
ఇదీ చదవండి:నీటి ఉద్ధృతికి కొట్టుకుపోయిన కుమారుడు క్షేమం.. తండ్రి గల్లంతు