తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

రక్షణ గోడను ఢీకొట్టిన టిప్పర్​.. తప్పిన పెనుప్రమాదం - yadadri temple

యాదాద్రి ఆలయ పనుల్లో భాగంగా కొండపై నుంచి వస్తున్న టిప్పర్​ అదుపుతప్పి రక్షణ గోడను ఢీకొట్టింది. అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.

tipper collide defensive wall in yadadri
రక్షణ గోడను ఢీకొట్టిన టిప్పర్​.. తప్పిన పెనుప్రమాదం

By

Published : Nov 7, 2020, 8:36 AM IST

యాదాద్రి ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా కొండపై నుంచి ఇసుక లోడుతో వస్తున్న టిప్పర్ అదుపు తప్పి ఘాట్​ రోడ్డు రక్షణ గోడను ఢీకొట్టింది. అక్కడ భక్తులు ఎవరూ లేకపోవడం వల్ల పెనుప్రమాదం తప్పింది. ఇసుక లోడుతో టిప్పర్​ కిందకు వస్తున్న క్రమంలో మూలమలుపు వద్ద వాహనాలను తప్పించబోయి రక్షణ గోడను ఢీకొట్టింది. రక్షణ గోడ కాస్తా బీటలు వారింది.

కాసేపు వాహన రాకపోకలకు ఇబ్బంది ఏర్పడగా... జేసీబీ సహాయంతో టిప్పర్​ను పక్కకు తొలగించారు. వాహనాల రవాణాకు, భక్తులు కొండపైకి వెళ్లేందుకు ఒకే దారి ఉండడం వల్ల ఇబ్బందులు తప్పడం లేదు. కొండపైకి వెళ్లేందుక రెండో ఘాట్​ రోడ్డును భక్తులకు అందుబాటులోకి తేవాలని స్థానికులు, భక్తులు కోరుతున్నారు.

ఇవీ చూడండి: గ్రేటర్​లో నాలాలు, డ్రైన్ల అభివృద్ధి, చెరువులపై ప్రత్యేక దృష్టి

ABOUT THE AUTHOR

...view details