గుప్త నిధుల కోసం కొందరు దుండగులు పురాతన దేవాలయంలో తవ్వకాలు జరిపిన ఘటన నాగర్కర్నూల్ జిల్లా గోవిందాయపల్లిలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో చోటుచేసుకుంది.
గుప్త నిధుల కోసం పురాతన ఆలయంలో తవ్వకాలు - తెలంగాణ వార్తలు
గుప్తనిధుల కోసం ఆలయంలో తవ్వకాలు జరిపిన ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో చోటు చేసుకుంది. తాడూరు మండలం గోవిందాయిపల్లిలోని పురాతన శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో గుర్తుతెలియని వ్యక్తులు బుధవారం రాత్రి గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపారు.
గుప్త నిధుల కోసం పురాతన ఆలయంలో తవ్వకాలు
ఆలయంలోని నంది విగ్రహాన్ని పక్కకు జరిపి తవ్వకాలు జరిపారు. రాత్రివేళ ఎవరికి అనుమానం రాకుండా తవ్వినట్లు పోలీసులు తెలిపారు. తవ్వకాల్లో ఏం దొరికి ఉండదని... తెల్లారిపోవడం వల్ల దుండగులు పారిపోయి ఉంటారని పోలీసులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చూడండి:ఇంటికి కన్నం వేసిన ఫేస్బుక్ మిత్రుడు