తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ముగ్గురు గిరిజన యువతుల అదృశ్యం.. ఎటెళ్లినట్టు, ఏమైనట్టు? - అశ్వారావుపేటలో ముగ్గురు యువతులు అదృశ్యం

అశ్వారావుపేట మండలం మారుమూల అటవీ ప్రాంతంలోని ఓ గ్రామానికి చెందిన ముగ్గురు గుత్తికోయ యువతులు అదృశ్యమయ్యారు. ఛత్తీస్​గఢ్​కు చెందిన వంజం దేవా వారిని ఈ నెల 16న తీసుకెళ్లాడని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అశ్వారావుపేటలో ముగ్గురు గుత్తికోయ యువతులు అదృశ్యం
అశ్వారావుపేటలో ముగ్గురు గుత్తికోయ యువతులు అదృశ్యం

By

Published : Sep 21, 2020, 7:53 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో ముగ్గురు గుత్తికోయ యువతులు అదృశ్యమయ్యారు. 17, 18, 19 ఏళ్ళు ఉన్న ముగ్గురు ఈనెల 16 నుంచి కనిపించకుండా పోయారు. వారిని ఛత్తీస్​గఢ్​కు చెందిన వంజం దేవా తీసుకెళ్లాడని... బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ముగ్గురిని అశ్వారావుపేట మండలంలోని గాండ్లగూడెంలో ఒక వ్యక్తి ఇంట్లో ఉంచి... మరుసటి రోజు తెల్లవారుజామున దేవా తనతో తీసుకువెళ్లినట్లు ఆ ఇంటి యజమాని తమకు చెప్పారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ ముగ్గురు యువతులను తీసుకువెళ్లిన వ్యక్తి ఎవరు..?, అతనికి మావోయిస్టులతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా... అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:బండల లోడు లారీ బోల్తా.. ఇద్దరు మృతి

ABOUT THE AUTHOR

...view details