వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట్ మండలం రాంపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. వేడినీరు మీద పడి హర్షిణి అనే మూడేళ్ల చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి.
గ్రామానికి చెందిన శంకర్ అనే వ్యక్తి తన కూతురు హర్షిణికి స్నానం చేయించేందుకు బకెట్లో వేడినీటిని తీసుకెళ్లి స్నానాల గదిలో పెట్టాడు. చిన్నారి పరుగెత్తుకు వెళ్లి బకెట్‌ను తన వైపుకు వంపుకుంది. ఈ క్రమంలో వేడి నీరు మీదపడి చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి.