తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

మాదకద్రవ్యాల కేసులో ముగ్గురు సాఫ్ట్​వేర్​ ఇంజినీర్లు అరెస్ట్ - మాదకద్రవ్యాల కేసులో ముుగ్గురు అరెస్ట్

మాదకద్రవ్యాల కేసులో హైదరబాద్​లోని ముగ్గురు సాఫ్ట్​వేర్​ ఇంజినీర్లను ఎక్సైజ్​ ఎన్​పోర్స్​మెంట్ అధికారులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి హశిష్​ ఆయిల్, ఎల్​ఎస్​డీ మత్తుపదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Three software engineers arrested in drug case in hyderabad
మాదకద్రవ్యాల కేసులో ముగ్గురు సాఫ్ట్​వేర్​ ఇంజినీర్లు అరెస్ట్

By

Published : Dec 2, 2020, 6:40 PM IST

హైదరాబాద్​లో మాదకద్రవ్యాలు విక్రయిస్తున్న ముగ్గురు సాఫ్ట్​వేర్ ఇంజినీర్లను ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 56 ఎల్‌ఎస్‌డీ బ్లాట్లు, 236 గ్రాముల హశిష్‌ ఆయిల్‌ స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన వారిలో మౌలాలికి చెందిన శివసేనారెడ్డి, వనస్థలిపురంలోని కమలానగర్​వాసి మేకసాయి విపిన్​, మల్కాజిగిరికి చెందిన చెరుకూరి హర్షవర్ధన్​ ఉన్నారు. మరో నిందితుడు విశాఖపట్నం వాసి కార్తీక్‌ పరారీలో ఉన్నాడని ఎక్సైజ్‌ అధికారులు తెలిపారు.

మల్కాజిగిరిలోని సాయివిపిన్‌ ఇంట్లో, సింగ్‌పూర్‌ టౌన్‌షిప్‌లో హర్షవర్ధన్‌ ఇంటిని సోదా చేశారు. విశాఖపట్నానికి చెందిన కార్తిక్‌ వద్ద కిలో ఆయిల్‌ రూ.లక్ష రూపాయలకు కొనుగోలు చేసి...12 గ్రాముల ప్లాస్టిక్‌ బాటిల్‌ ఒక్కోటి రూ. 2 వేల 5 వందలకు అమ్ముతున్నట్లు దర్యాప్తులో నిందితులు అంగీకరించారు. గోవా నుంచి ఎల్​ఎస్​డీ బ్లాట్లు తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తున్నారని ఎక్సైజ్‌ అధికారుల విచారణలో వెల్లడైంది.

ఇదీ చూడండి:గ్రేటర్​లో 46.55శాతం.. ఓల్డ్ మలక్​పేటలో రేపు రీపోలింగ్

ABOUT THE AUTHOR

...view details