తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ద్విచక్రవాహనాలు దొంగతనం చేస్తున్న ముగ్గురు అరెస్ట్​ - bike theft case latest update

ద్విచక్రవాహనాలు దొంగతనాలు చేస్తున్న ముగ్గురి సభ్యుల ముఠాను హైదరాబాద్​ నార్త్​జోన్​ టాస్క్​ఫోర్స్​ పోలీసులు పక్కా సమాచారంతో పట్టుకున్నారు. వారి నుంచి ఆరు బైకులు, ఓ ఆటోను స్వాధీనం చేసుకుని.. నిందితులను లంగర్​హౌస్​ పోలీసులకు అప్పగించారు.

Three arrested for stealing two-wheelers at hyderabad by northzone taskforce police
ద్విచక్రవాహనాలు దొంగతనం చేస్తున్న ముగ్గురు అరెస్ట్​

By

Published : Oct 30, 2020, 10:12 PM IST

వ్యసనాలకు అలవాటుపడి డబ్బులు చాలక తరచుగా వాహన దొంగతనాలు చేస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను హైదరాబాద్​ నార్త్​జోన్​ టాస్క్​ఫోర్స్​ పోలీసులు పట్టుకున్నారు. లంగర్​హౌస్​లో నివసించే కిశోర్, అనిల్, వికాస్​.. వ్యసనాలకు డబ్బులు చాలక రాత్రి వేళల్లో కాలనీలో పార్క్​ చేసిన వాహనాలను దొంగలించేవారు. వాటిని అమ్మి సొమ్ము చేసుకుని విలాసవంతంగా జీవించేవారు.

శుక్రవారం నార్త్​జోన్​ టాస్క్​ఫోర్స్​ పోలీసులకు వీరి గురించి కచ్చితమైన సమాచారం అందగా.. వారిని పట్టుకున్నారు. నిందితుల నుంచి ఆరు ద్విచక్రవాహనాలతో పాటు ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. వారి ముగ్గురిని లంగర్​హౌస్​ పోలీసులకు అప్పగించారు.

ఇదీ చదవండిఃగత నాలుగు రోజుల్లో 203 మంది అదృశ్యం.. కారణాలివేనా?

ABOUT THE AUTHOR

...view details