హైదరాబాద్ పాతబస్తీ కాలపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మొచికాలనీలోని దండు మారమ్మ దేవాలయంలో చోరీ జరిగిందని ఆలయ కమిటీ జనరల్ సెక్రటరీ రమేశ్ తెలిపారు. ఇవాళ ఉదయం ఆలయాన్ని తెరవగా.. లోపల ఉన్న హుండీని ధ్వంసం చేసి డబ్బులను దొంగలించినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయని రమేశ్ అన్నారు. గర్భగుడిలోని ఆరతి పళ్లెం, గంటను కూడా దొంగలించారని చెప్పారు.
మొచికాలనీలోని దండు మారమ్మ దేవాలయంలో చోరీ
హైదరాబాద్ పాతబస్తీ మొచికాలనీలో ఉన్న దండు మారమ్మ దేవాలయంలో చోరీ జరిగింది. హుండీని ధ్వంసం చేసి డబ్బులు దొంగలించిన ఆనవాళ్లు ఉన్నాయని ఆలయ కమిటీ జనరల్ సెక్రటరీ రమేశ్ తెలిపారు.
మొచికాలనీలోని దండు మారమ్మ దేవాలయంలో చోరీ
సమాచారం మేరకు కాలపత్తర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. చార్మినార్ ఏసీపీ అంజయ్య ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆలయం గోడదూకి చోరీ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇదీ చూడండి: రష్యా టీకాపై ఇప్పుడే ఏమీ చెప్పలేం: ఎయిమ్స్