హైదరాబాద్ సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సాయిగణేశ్ మద్యం దుకాణంలో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. కిటికీ గ్రిల్స్ తొలగించి వైన్స్‌లోకి చొరబడ్డ నిందితులు.. 3 కాటన్ల మద్యం, రూ. 6 వేలు ఎత్తుకెళ్లారు. దొంగతనాన్ని గుర్తించిన దుకాణ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు సీసీ ఫుటేజీని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
సనత్‌నగర్ మద్యం దుకాణంలో చోరీ - latest news on Theft in a liquor store at sanathnagar
సనత్‌నగర్‌లోని ఓ మద్యం దుకాణంలో చోరీ జరిగింది. యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సనత్‌నగర్ మద్యం దుకాణంలో చోరీ
TAGGED:
మద్యం దుకాణంలో చోరీ