యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలోని నల్ల మల్లయ్య అనే రైతు ఇంట్లో చోరీ జరిగింది. ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి చొరబడిన దుండగులు.. సుమారు 5 తులాల బంగారం, 70 తులాల వెండి అపహరించుకుపోయారు.
గ్రామానికి చెందిన నల్ల మల్లయ్య శుక్రవారం సాయంత్రం ఇంటికి తాళం వేసి నార్కట్పల్లి మండలం కక్కిరేని గ్రామంలోని బంధువుల ఇంటికి వెళ్లాడు. శనివారం ఉదయం ఇంటికి వచ్చేసరికి తలుపులు తీసి ఉన్నాయి. ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువా పగులగొట్టి ఉంది. అందులోని సుమారు 5 తులాల బంగారం, 70 తులాల వెండిని దుండగులు ఎత్తుకెళ్లినట్లు గుర్తించాడు.