పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలోని తిలక్ నగర్‌కు చెందిన ఆడేపు బాపు (63)ను కుమారుడు హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసి పోలీసులకు చిక్కాడు. గత కొద్ది రోజులుగా మద్యానికి బానిసైన బుచ్చిబాబు తాగిన మత్తులో తండ్రిని కొట్టి చంపాడు.
'తండ్రిని చంపాడు.. ఆత్మహత్యలా చిత్రీకరించాడు' - Peddapalli District Crime News
కంటికి రెప్పలా కాపాడాల్సిన కొడుకే కాలయముడయ్యాడు. అతి కిరాతకంగా తండ్రిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాలనుకున్నాడు. కట్ చేస్తే.. పోలీసులకు చిక్కాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో చోటుచేసుకుంది.
'తండ్రిని చంపాడు.. ఆత్మహత్యలా చిత్రీకరించాడు'
ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నంలో పోలీసులకు దొరికిపోయాడు. గోదావరిఖని ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. విచారణలో తండ్రిని హత్య చేసినట్లు నిర్ధరణ అయింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చదవండి:అక్రమంగా తరలిస్తున్న అర కిలో బంగారం పట్టివేత