ఏపీలోని గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం కండ్రిక శివారు రేగులగడ్డ గ్రామంలో.. ఈనెల 19వ తేదీ రాత్రి గ్రామానికి చెందిన పోతురాజు.. దారుణ హత్యకు గురయ్యాడు. అతని చెల్లి, ఆమెకు సన్నిహితుడైన వ్యక్తితో కలసి రోకలి బండతో తలపై కొట్టడం వల్లనే పోతురాజు మృతి చెందాడని పోలీసులు తేల్చారు.
వివరాల్లోకి వెళితే..
రేగులగడ్డకు చెందిన గుంజి సాంబయ్య, నాగమ్మ దంపతులకు పోతురాజు, ఆదిలక్ష్మి ఇద్దరు సంతానం. పోతురాజుకు సత్తెనపల్లి మండలం గసర్లపాఫు గ్రామానికి చెందిన వీరమ్మతో వివాహం అయింది. పోతురాజు మద్యానికి బానిస అయిన కారణంగా.. వీరమ్మ విడిగా బతుకుతోంది.
మరోవైపు... పోతురాజు సోదరి ఆదిలక్ష్మికి అమరావతి మండలం అత్తలూరుకు చెందిన శ్రీనివాసరావుతో వివాహం జరిగింది. ఇద్దరికీ మనస్పర్థలు తలెత్తాయి. ఆదిలక్ష్మి తల్లిగారి ఊరైన కండ్రికలో ఉంటోంది. ఆమె పిల్లలు అమ్మమ్మ ఇంట్లో ఉంటున్నారు. ఈ క్రమంలో ఆదిలక్ష్మికి... గ్రామానికి చెందిన సారాల సాంబయ్యతో సంబంధం ఏర్పడింది.