తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

పండగ పూట విషాదం... ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి - ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి

కుటుంబ పెద్ద గతేడాది చనిపోగా సంవత్సరికం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కొడుకులు, కోడళ్లు, మనవళ్లు అంతా వచ్చారు. అందరూ ఒకే గదిలో పడుకున్నారు. పండగ పూట మిద్దె రూపంలో వారిని దురదృష్టం వెంటాడింది. వనపర్తి జిల్లా బుద్ధారంలో శనివారం అర్ధరాత్రి ఇంటి పైకప్పు కూలిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతిచెందారు.

The roof worker of the house dies five members of the same family in bhuddaram village in Wanaparthy district
పండగ పూట విషాదం... ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి

By

Published : Oct 25, 2020, 8:29 AM IST

వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలం బుద్ధారంలో పండగ పూట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శనివారం అర్ధరాత్రి ఇంటి పైకప్పు కూలిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతిచెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఈ ఘటనతో మిగిలిన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

వెంటాడిన దురదృష్టం..

బుద్ధారం గ్రామానికి చెందిన చెవ్వ నర్సింహ ఏడాది క్రితం మరణించాడు. అతడి భార్య మణెమ్మ గ్రామంలోనే నివసిస్తుండగా.. వారి కుమారులు హైదరాబాద్​లో ఉంటున్నారు. తండ్రి సంవత్సరికంగా వారు కుటుంబాలతో కలిసి ఇటీవలే గ్రామానికి వచ్చారు. శనివారం కార్యక్రమం ముగిసిన తర్వాత భోజనం చేశారు. మొత్తం 9 మంది ఓ గదిలో నిద్రించారు.

ఐదుగురు మృతి..

అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా గది పైకప్పు కూలిపడింది. గదిలో నిద్రిస్తున్న మణెమ్మ, ఆమె ఇద్దరు కోడళ్లు సుప్రజ, ఉమాదేవి, మనవరాళ్లు వైష్ణవి, అక్షయ మృతిచెందారు. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా, ముగ్గరికి స్వల్ప గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన జరిగిన వెంటనే కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఒకే కుటుంబంలో ఐదుగురు ఇలా మృతిచెందడం వల్ల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాలో ఇటీవల వర్షాలకు ఇళ్లు కూలి పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు:

  • అక్టోబర్ 14న నాగర్​కర్నూల్ జిల్లా కుమ్మెరలో మట్టిమిద్దె కూలి హనుమంత్​ రెడ్డి, అనసూయ వృద్ధ దంపతులు, వారి మనవడు హర్షవర్ధన్ రెడ్డి మృత్యువాత పడ్డారు.
  • నాగర్​కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం రాకొండలో పాత ఇల్లు కూలి తల్లీ కూతుళ్లు మృత్యువాత పడ్డారు.
  • మహబూబ్​నగర్ జిల్లా గండీడ్ మండలం పగిడ్యాలలో మట్టిమిద్దె కూలి తల్లి, ఇద్దరు కూతుళ్లు ప్రాణాలు కోల్పోయారు.
  • నారాయణపేట జిల్లా ధన్వాడ మండలంలో మట్టి మిద్దె కూలడం వల్ల ఆర్నెళ్ల చిన్నారికి నూరేళ్లు నిండాయి.
  • నారాయణపేట జిల్లా మరికల్ మండలంలోనూ శిథిలావస్థకు చేరిన ఇల్లు కూలి వృద్ధురాలి దుర్మరణం చెందింది.
  • నాలుగు నెలల కిందట నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలం పెద్ద పొర్లలో ఇల్లుకూలి ఓ వ్యక్తి ప్రాణాలు విడిచారు.

ఇవీచూడండి:ఇద్దరు పిల్లలతో సహా... తల్లి అదృశ్యం

ABOUT THE AUTHOR

...view details