ఓ బాలిక ఫొటోలు, వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తూ ఆమె నుంచి నాలుగు లక్షల రూపాయలు కాజేసిన ముగ్గురిని జీడిమెట్ల పోలీసులు అరెస్టు చేశారు.
అసలు ఏమైందంటే...
కరోనా ప్రభావం వల్ల స్కూళ్లు మూతపడ్డాయి. ప్రభుత్వ సూచనలతో ఇటీవలే అన్లైన్ క్లాసులు ప్రారంభం కావడం వల్ల జీడిమెట్ల అయోధ్యనగర్‌కు చెందిన ఓ బాలికకు ఆమె తల్లిదండ్రులు ఫోన్ కొనిచ్చారు. ఆ బాలిక ఫోన్లో ఇన్‌స్ట్రాగ్రాం వాడడం ప్రారంభించింది. అందులో ఆమెకు ముగ్గురు యువకులు పరిచయమయ్యారు. వారంతా కలిసి తరుచూ టిక్‌టాక్ వీడియోలు, ఫొటో షూట్లు చేశారు.
కొంతకాలానికి వారి అసలు రూపం బయటపడింది. బాలిక ఫొటోలు, వీడియోలు తీసి వాటితో ఆమెను బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించారు. ఆమె నుంచి పలు దఫాలుగా నగదు, గిఫ్ట్‌ల రూపంలో సుమారు నాలుగు లక్షలు వరకు కాజేశారని పోలీసులు తెలిపారు.