చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తిమ్మిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన ప్రభాకర్‌రెడ్డి (70) కుటుంబ కారణాల నేపథ్యంలో తల్లి సుశీలమ్మ(91)తో కలిసి కొద్ది నెలలుగా మండలంలోని రంగంపేట క్రాస్‌లో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. వయసు పైబడటం వల్ల ఆమె పూర్తిగా మంచానికే పరిమితమైంది.
కళ్లెదుటే కుమారుడి మృతదేహం...దిక్కుతోచని స్థితిలో మాతృహృదయం - mother helplessness at chittoor
కన్నకొడుకు మరణించి మూడు రోజులు గడిచాయి. కళ్లెదుటే మృతదేహం ఉన్నా అచేతనంగా పడి ఉన్న ఆ మాతృమూర్తి ఏమీ చేయలేని పరిస్థితి. ఎవరికి చెప్పాలో తెలియదు. అసలు అటువైపు ఎవరూ రాలేదు. మృతదేహాన్ని చూస్తూ ఆమె మౌనంగా రోదించింది. ఈ హృదయ విదారక సంఘటన చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తిమ్మిరెడ్డిపల్లెలో చోటుచేసుకుంది.
ఏపీ: కళ్లెదుటే కుమారుడి మృతదేహం...దిక్కుతోచని స్థితిలో మాతృహృదయం
మరోవైపు అనారోగ్యంతో ఉన్న ప్రభాకర్‌రెడ్డి మూడు రోజుల కిందట అద్దె ఇంట్లోనే మరణించారు. రోజులు గడిచాక మృతదేహం నుంచి దుర్వాసన వస్తుండగా గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. వారు అక్కడికి వెళ్లి ప్రభాకర్‌రెడ్డి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. నిస్సహాయ స్థితిలో ఉన్న సుశీలమ్మను చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి:విషాదం: నీట మునిగి దంపతులు మృతి