మేడ్చల్ జిల్లా కీసర లంచం కేసులో నలుగురు నిందితులు న్యాయ స్థానంలో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కస్టడీ కూడా ముగిసినందున బెయిల్ మంజూరు చేయాలని వారి న్యాయవాది న్యాయస్థానాన్ని కోరారు.
కీసర లంచం కేసులో బెయిల్ పిటిషన్ దాఖలు నిందితులు
కీసర లంచం కేసులో నలుగురు నిందితులు న్యాయ స్థానంలో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కేసులో కస్టడీ కూడా ముగిసినందున బెయిల్ మంజూరు చేయాలని నిందితుల తరఫు న్యాయవాది న్యాయస్థానాన్ని కోరారు.
కీసర లంచం కేసులో బెయిల్ పిటిషన్ దాఖలు నిందితులు
బెయిల్ పిటిషన్ విషయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు కౌంటర్ దాఖలు చేశారు. కోటి 10 లక్షలు లంచం తీసుకున్న కేసులో నిందితులు ఎలాంటి వివరాలు వెల్లడించలేదని నిందితులను మరోసారి విచారించాల్సి ఉందని ఏసీబీ కౌంటర్లో పేర్కొంది. ఇరువురు వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
ఇదీ చదవండి:రూ.1.10 కోట్లు లంచం తీసుకుంటూ అనిశాకు చిక్కిన కీసర తహసీల్దార్