తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య - prakasham district news

ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన ఘటన ఏపీలోని ప్రకాశం జిల్లా మార్కాపురంలో కలకలం సృష్టించింది. పథకం ప్రకారమే ఈ హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.

the-incident-in-which-priyudi-killed-her-husband-took-place-in-prakasam-district-markapuram
ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య

By

Published : Aug 29, 2020, 1:41 PM IST

ప్రియుడితో కలిసి భర్తను భార్య హత్య చేసిన ఘటన ఆంధ్రప్రదేశ్​లోని ప్రకాశం జిల్లా మార్కాపురంలోని ఏకలవ్య కాలనీవాసులను ఉలిక్కిపడేలా చేసింది. ఏకలవ్య కాలనీలో నివాసం ఉండే దేవరాజ్ తమకు నగదు ఇవ్వాలని... భర్త వెంకటేశ్వర్లును భార్య అశ్విని నమ్మించింది. పథకం ప్రకారం ప్రియుడి ఇంటికి భర్తను తీసుకెెళ్లింది.

విషయం పసిగట్టలేకపోయిన భర్త.. భార్య మాయమాటలు నమ్మి దేవరాజ్ ఇంటికి వెళ్లాడు. అప్పటికే ఇంట్లో దేవరాజ్ మద్యం సేవిస్తున్నాడు. అక్కడికి వెళ్లిన వెంకటేశ్వర్లుపై అతని భార్య సహకారంతో ఇనుప రాడ్డుతో దాడి చేసి హతమార్చాడు దేవరాజ్. అనంతరం మృతుడి ద్విచక్ర వాహనం పైనే ప్రియురాలు అశ్వినితో కలిసి దేవరాజ్ పరారయ్యాడు.

ఇదీ చదవండి:అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీసులను అడ్డుకున్న సర్పంచ్‌ వర్గం

ABOUT THE AUTHOR

...view details