ఆదిలాబాద్ జిల్లా రిమ్స్ ఆసుపత్రిలో మరణించిన వ్యక్తి మార్చూరీకి తరలించిన అనంతరం.. కదలికలు కనిపించడంతో బతికే ఉన్నాడనే వింత సంఘటన జరిగింది. గుడిహత్నూర్ మండలం తోషం తండాకు చెందిన రైతు రాథోడ్ ప్రకాష్ తన పంట చేనులో పురుగుల మందు తాగి బలవన్మరణానికి యత్నించాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం ప్రకాష్ మృతిచెందినట్లు వైద్యులు నిర్ధరించడంతో మృతదేహాన్ని శవాగారానికి తరలించారు.
మరణించిన వ్యక్తికి మళ్లీ చికిత్స.. చివరికి ఏమైందంటే! - adilabad rims hospital news
ఓ వ్యక్తి మృతి చెందాడని మార్చురీకి తరలించి.. ఆ తర్వాత కదలికలు కనిపించడంతో తిరిగి ఆసుపత్రికి తీసుకొచ్చి చికిత్స చేసిన విచిత్ర ఘటన ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో చోటుచేసుకుంది.
మరణించిన వ్యక్తికి మళ్లీ చికిత్స!
అక్కడ ఆయన దవడలు కదలడాన్ని గమనించిన కుటుంబీకులు తిరిగి హుటాహుటిన ఆసుపత్రికి తీసుకొచ్చారు. అత్యవసర విభాగంలో గంటసేపు చికిత్సలు అందించిన వైద్యులు... ఈసీజీ పరీక్ష చేసి సదరు వ్యక్తి మృతి చెందినట్లుగా తేల్చడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనతో కుటుంబీకులు తొలుత ఉత్తమ మనిషి బతుకుతాడని అనుకున్న ఆశను తరువాత తీరని దుఃఖాన్ని మిగిల్చింది.
ఇదీ చూడండి :కందిపంటకు నిప్పుపెట్టిన గుర్తుతెలియని వ్యక్తులు