యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండల కేంద్రంలో నివాసముంటున్న బోడ్డుపల్లి లక్ష్మయ్యకు నలుగురు కూతుళ్లు. తరచు భార్యాభర్తల మధ్య గొడవలు తలెత్తడం వల్ల 17 ఏళ్ల క్రితం భార్య తన నాలుగో కూతురిని తీసుకుని తల్లిగారింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి భార్య భార్తలు విడివిడిగా ఉంటూ జీవనం కొనసాగిస్తున్నారు.
రెండు సంవత్సరాల క్రితం వీరి రెండో కుమార్తె హత్యకు గురైంది. అనంతరం గత ఏడాది పెద్ద మనుషుల ఒప్పందంతో భార్య... భర్తతో కాపురం చేసేందుకు వచ్చింది. డబ్బుల విషయంలో భార్యాభర్తల మధ్య తరచూ తగాదాలు అవుతుండేవి. ఈ తరుణంలో తల్లి, కూతురు స్థానిక పోలీసు స్టేషన్లో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని తండ్రిపై పిర్యాదు చేశారు.