వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో దారుణం చోటుచేసుకుంది. నెహ్రూ మైదానం సమీపంలోని ప్రధాన కాలువలో నెలలు నిండని ఓ పసికందు మృతదేహం లభ్యమైంది. గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు విచారిస్తున్నారు.
కాలువలో నెలలు నిండని శిశువు మృతదేహం.. ఎవరు పడేశారో? - హన్మకొండలో కాలువలో పసికందు మృతదేహం లభ్యం వార్తలు
నెలలు నిండని ఓ పసికందు మృతదేహం కాలువలో లభ్యమైంది. ఈ విషాదకర ఘటన వరంగల్ అర్బన్ జిల్లాలో చోటుచేసుకుంది.

కాలువలో నెలలు నిండని శిశువు మృతదేహం.. ఎవరు పడేశారో?
ప్రధాన కాలువకు దగ్గరలో ఆసుపత్రులు ఉండటంతో.. ఎవరైనా గుర్తుతెలియని వ్యక్తులు పసికందును ఇందులో పడేసి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు.
ఇదీచూడండి: కోతులకు అరటిపండ్లు వేసి వస్తుండగా ప్రమాదం.. ఇద్దరు మృతి