తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతదేహం లభ్యం - కామారెడ్డి జిల్లాలో అనుమానాస్పద మృతి

ద్విచక్రవాహనం మీద పడి ఉన్న స్థితిలో ఓ వ్యక్తి మృతదేహం లభించింది. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం పిట్లం చౌరస్తా సమీపంలోని అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అయితే అతని మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనుమానాస్పదస్థితిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

The body of a person was found in a suspicious condition in kamareddy district
అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతదేహం లభ్యం

By

Published : Dec 1, 2020, 5:46 PM IST

అనుమానాస్పదస్థితిలో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది. నిజాంసాగర్ మండలం పిట్లం చౌరస్తా సమీపంలోని అటవీప్రాంతంలో మృతదేహం లభ్యమైంది. అతనిపై ద్విచక్రవాహనం పడి ఉండడంతో మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మంగళూరు గ్రామానికి చెందిన మత్తమాల విఠల్(35) వారం క్రితం హైదరాబాద్ వెళ్తున్నానని చెప్పి ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. అతను వెళ్లినప్పటి నుంచి కుటుంబసభ్యులకు ఫోన్ చేయకపోవడంతో గాలింపు చర్యలు చేపట్టారు. రహదారిపై అటుగా వెళ్తున్న వాహనదారునికి దుర్వాసన రావడంతో గమనించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మతదేహాన్ని పోస్టుమార్టం కోసం బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై హైమద్ వెల్లడించారు.

ఇదీ చూడండి:రెండు వేలకోసం తల్లిని హతమార్చిన తనయుడు

ABOUT THE AUTHOR

...view details