హైదరాబాద్ సనత్నగర్ డివిజన్ బాలయ్యనగర్లో బాలాజీ అపార్ట్మెంట్లో నివసించే గంట గాంధీ-రమాదేవి, గంట సంతోశ్-మంగమ్మ దంపతులు వారి చుట్టుపక్కల నివసించే వారిని నమ్మబలికి వ్యాపారంలో పెట్టుబడి పెట్టించారు. వ్యాపారంలో పెట్టుబడి పెడితే వచ్చిన లాభంలో కమిషన్ ఇస్తామని చెప్పి.. రూ.10 కోట్లు దండుకున్నారు.
పెట్టుబడి పేరుతో రూ.10కోట్లు టోకరా.. బాధితుల ఆందోళన
వ్యాపారంలో పెట్టుబడి పెడితే.. వచ్చిన లాభంలో కమిషన్ ఇస్తామని నమ్మబలికిన దంపతులు.. రూ.10 కోట్లు దండుకుని మోసం చేసిన సంఘటన హైదరాబాద్ సనత్నగర్ డివిజన్లోని బాలాజీ అపార్ట్మెంట్లో చోటుచేసుకుంది. తమను మోసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
పెట్టుబడి పేరుతో రూ.10కోట్లు టోకరా
వారి మోసం గమనించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. సనత్నగర్ పోలీసులకు అపార్ట్మెంట్ వాసులు (బాధితులు) నాగజ్యోతి, మన్మథరావు, పూర్ణిమ, హేమలత, నాగమణిలు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని కోరారు.
- ఇదీ చూడండి:బల్దియా పోటీకి ఎవరు అర్హులు.. ఎవరు అనర్హులు?