మైనర్లకు, మత్తుకి అలవాటు పడిన వారికి అధికమొత్తంలో దగ్గు మందు అమ్ముతున్న వ్యక్తిని సెంట్రల్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌లోని గోషామహల్ దారుస్సలాం వద్ద ఉన్న అగర్వాల్ మెడికల్ దుకాణంపై సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు, డ్రగ్ డిపార్ట్మెంట్ అధికారులు దాడి చేశారు.
దగ్గు మందు అమ్మినందుకు మెడికల్‌షాప్ యజమాని అరెస్ట్
హైదరాబాద్ గోషామహల్లో ప్రిస్క్రిప్షన్ లేకుండా అధికమొత్తంలో దగ్గు మందు అమ్ముతున్న వ్యక్తిని సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుని వద్ద నుంచి 154 టానిక్ సీసాలను స్వాధీనం చేసుకున్నారు.
task force seized medical shop owner for selling calf syrup
మందుల దుకాణం యజమాని జయంత్ అగర్వాల్‌ను అదుపులోకి తీసుకున్నారు. దగ్గుకు సంబంధించిన 154 సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ టానిక్‌ను అధిక మొత్తంలో వాడడం వల్ల ఆరోగ్యానికే ప్రమాదమని... వాటికి బానిసలుగా మారుతారని పోలీసులు వివరించారు. అనంతరం నిందితున్ని బేగంబజార్ పోలీసులకు అప్పగించారు.