హైదరాబాద్ పాతబస్తీలో క్రికెట్ బుకింగ్‌లకు పాల్పడుతుండగా... పోలీసులు దాడులు నిర్వహించారు. పక్కా సమాచారంతో సౌత్ జోన్ టాస్క్‌ఫోర్స్‌తో కలిసి బహాదుర్పుర పోలీసులు ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్‌ను గుట్టురట్టు చేశారు. సంయుక్తంగా చేసిన దాడిలో మహ్మద్ అరిఫ్‌ను అరెస్ట్ చేయగా.. ప్రధాన నిందితుడు పర్వేజ్ పరారయ్యాడు. వారి నుంచి రూ.70వేల నగదు, ఒక చరవాణిని స్వాధీనం చేసుకున్నారు.
పాతబస్తీలో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్... - తెలంగాణ వార్తలు
పాతబస్తీలో ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తుండగా సౌత్ జోన్ టాస్క్‌ఫోర్స్, బహదూర్‌పురా పోలీసులు.. సంయుక్తంగా దాడి చేశారు. మహ్మద్ అరిఫ్‌ను అరెస్ట్ చేయగా.. ప్రధాన నిందితుడు పర్వేజ్ పరారయ్యాడు.
ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు.. ఒకరు అరెస్ట్
క్రికెట్ బుకింగ్ ప్రధాన సూత్రధారి పర్వేజ్ హుస్సేన్ అలం నివాసి. అతను సులభంగా డబ్బు సంపాదన కోసం బుకింగ్‌లకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి: అగ్ని ప్రమాదం.. ఇంట్లో వస్తువులన్నీ దగ్ధం