తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

పెళ్లైన పదిరోజులకే నవ వరుడు బలవన్మరణం - new groom suicide news

పెళ్లై పట్టుమని పది రోజులు కూడా కాలేదు. వాకిట్లో కట్టిన పచ్చని తోరణాలు కూడా ఆరలేదు. పెళ్లి అనంతర కార్యక్రమాలు ఇంకా పూర్తవనేలేదు. అంతలోనే ఇష్టం లేని పెళ్లి చేశారని మనస్తాపానికి గురై.. ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడో కొత్త పెళ్లికొడుకు.

suicide-of-new-groom-who-got-married-against-marriage
పెళ్లైన పదిరోజులకే నవ వరుడు బలవన్మరణం

By

Published : Jan 13, 2021, 10:49 PM IST

ఇష్టం లేని పెళ్లి చేశారని మనస్తాపానికి గురై... పెళ్లైన పది రోజులకే ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన నల్గొండ జిల్లా శాలి గౌరారం మనిమెద్దె గ్రామంలో జరిగింది. ఈ ఘటనతో పండగ రోజు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

మనిమద్దే గ్రామానికి చెందిన గోళ్ల సోమయ్య ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేసేవాడు. ఈనెల 3న సమీప బంధువుల అమ్మాయితో అతనికి వివాహం జరిగింది. ఈనెల 11న కొత్తజంట నాటిపల్లి మండలం చెడ్పుగట్టు దేవాలయానికి వెళ్లి దర్శనం చేసుకొని నిన్న మనిమట్లెడు చేరుకున్నారు. నూతన దంపతులు రోజంతా కుటుంబీకులతో కలిసిమెలసి ఉన్నారు.

మంగళవారం సాయంత్రం సోమయ్య ఇంటి నుంచి బయటికి వెళ్లాడు. రాత్రి వరకు తిరిగి వస్తాడనుకుని కుటుంబ సభ్యులు నిద్రపోయారు. ఎంతకు ఇంటికి రాకపోవటంతో సోదరుడు, బంధువులు ఊరంతా గాలించారు. ఈ రోజు ఉదయం వారి పాత ఇంటి వద్దకు వెళ్లి చూడగా సోమయ్య ఉరివేసుకొని ఉన్నాడని బంధువులు తెలిపారు. మృతుని తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి: చెరువులో దూకబోయిన మహిళను కాపాడిన కానిస్టేబుల్‌

ABOUT THE AUTHOR

...view details