తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

'చాక్ పీస్​లు తినొద్దన్నందుకు ఆత్మహత్య చేసుకుంది' - చాక్ పీస్​లు తినొద్దన్నందుకు భార్య ఆత్మహత్య

మారుతున్న కాలంతోపాటు ప్రజల్లో కూడా ఓపిక, సహనం కూడా నశించిపోతుంది. భర్త తిట్టాడని, తల్లి మందలించిందని ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు పెరుగుతున్నాయి. తాజాగా అలాంటి ఘటనే ఇక్కడ జరిగింది. చాక్ పీస్​లు తినవద్దని భర్త తన భార్యను మందలించాడు. మనస్తాపానికి గురైన ఆమె ఇంట్లో ఫ్యాన్​కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

Suicide for eating chalk piece at jeedimetla
'చాక్ పీస్​లు తినొద్దన్నందుకు ఆత్మహత్య చేసుకుంది'

By

Published : Oct 12, 2020, 10:44 PM IST

జీడిమెట్ల పీయస్ పరిధి అయోద్యనగర్​లో ఓ గృహిణి ఆత్మహత్య చేసుకుంది. ఉత్తరప్రదేశ్, ఆజమ్​గర్ జిల్లాకు చెందిన భార్యభర్తలు తుఫాని యాదవ్​, సంజు యాదవ్​లు మూడేళ్ల క్రితం నగరానికి వలస వచ్చారు. అయోధ్య నగర్​లో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు. భర్త తుఫాని యాదవ్ స్థానిక కంపెనీలో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. భార్య గృహిణి. వీరి కుమారుడు వారి సొంత ఊర్లో ఉంటున్నాడు.

భార్య సంజు యాదవ్​కు చాక్​పీస్​లు తినడం అలవాటుగా మారింది. అది గమనించిన భర్త ఎన్నో సార్లు భార్యను తినవద్దని సూచించాడు. పక్కనున్న షాపులో చాక్ పీస్​లు అమ్మవద్దని భర్త దుఖాణాదారుడికి హెచ్చరించాడు.

ఇంట్లో ఎవరూ లేని సమయంలో భార్య సంజు ఇతర ప్రాంతంలోని కిరాణాకొట్టులో రెండు చాక్ పీస్ డబ్బులు కొనుక్కుని ఇంట్లో దాచిపెట్టుకుని చాక్ పీస్​లను తినేది. దీంతో ఆవేదన చెందిన భర్త మందలించి చాక్ పీస్​ డబ్బాలను బైట పడేశాడు. భార్య సంజూ(21)తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్​కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి :ప్రశ్నించినందుకు భార్యపై పెట్రోల్​ పోసి నిప్పంటించిన భర్త

ABOUT THE AUTHOR

...view details