కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన యువతి కుటుంబ కలహాల నేపథ్యంలో కాకతీయ కాలువలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. స్థానికులు వెంటనే నీటి ప్రవాహానికి కొట్టుకుపోతున్న ఆమెను కాపాడి ఒడ్డుకు చేర్చారు. సమాచారం తెలుసుకున్న ఎస్సై కృష్ణారెడ్డి బ్లూ కోట్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు.
కుటుంబ కలహాలతో యువతి ఆత్మహత్యాయత్నం - latest news of suicide attempt of a girl in kakatiya lake
కుటుంబ కలహాలతో మనోవేదనకు గురినై ఓ యువతి చావే శరణ్యం అంటూ కాకతీయ కాలువలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన స్థానికులు హుటాహుటిన నీటిలోకి దూకి ఆమెను రక్షించారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా అల్గునూరులో చోటుచేసుకుంది.
కుటుంబ కలహాలతో యువతి ఆత్మహత్యయత్నం
అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం అందించాలని ఎస్సై డాక్టర్లకు సూచించారు. యువతి ఆధారాలు సేకరించి కుటుంబ సభ్యులకు విషయం తెలిపేందుకు పోలీసులు యత్నిస్తున్నారు.
ఇదీ చదవండి:రాష్ట్ర కేబినెట్ భేటీ.. చర్చించే అంశాలివే!