విషం తాగి ఆర్టీసీ బస్సు ఎక్కిన బావా, మరదలిని సదాశివనగర్ మండల కేంద్రంలో తమ బంధువులు పట్టుకున్నారు. ఆత్మహత్యకు యత్నించిన బావ సాయిరాం, మరదలు రమ్యను గుర్తించారు. చికిత్స నిమిత్తం వారిని కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో కరీంనగర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు.
కామారెడ్డి జిల్లాలో బావ, మరదలి ఆత్మహత్యాయత్నం - crime updates in kamareddy district
బావ, మరదలు పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. ప్రస్తుతం వారిద్దరి పరిస్థితి విషమించడంతో కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. మరదలు రమ్యకు తన బావతో కాకుండా వేరే వ్యక్తితో పెళ్లి నిశ్చయించినందున ఆత్మహత్యకు యత్నించి ఉండొచ్చని బంధువులు అనుమానిస్తున్నారు.
కామారెడ్డి జిల్లాలో బావా, మరదళ్ల ఆత్మహత్యాయత్నం
గాంధారి మండలం పెద్దపోతంగల్ గ్రామానికి చెందిన సాయిరాం..కామారెడ్డి మండలం అడ్లూర్కు చెందిన రమ్య వరుసకు బావామరదలు. . ఈనెల 2న బాన్సువాడ పరిధిలోని బోర్లం గ్రామానికి చెందిన వ్యక్తితో రమ్యకు పెళ్లి నిశ్చయమైంది. బావతో కాకుండా వేరే వ్యక్తితో పెళ్లి నిశ్చయించినందున ఆత్మహత్యకు యత్నించినట్లు కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి: ఎలక్ట్రిక్ గోదాంలో అగ్ని ప్రమాదం.. రూ. 50 లక్షల ఆస్తి నష్టం