ముగిసిన సుధాకర్ వార్ - నీలిమ అలియాస్ మాధవి
సుధాకర్ దంపతులు డీజీపీ ఎదుట లొంగిపోయారు. ఆయుధాలను వదిలి జనజీవన స్రవంతిలో కలిశారు. మావోయిస్టు గ్రూపులో దోపిడీలు ఎక్కువయ్యాయని ఆవేదనతో బయటకు వచ్చినట్లు తెలిపారు.
లొంగిపోయిన సుధాకర్ దంపతులు
మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్, ఆయన భార్య నీలిమ డీజీపీ మహేందర్ రెడ్డి ముందు లొంగిపోయారు. మావోయిస్టు గ్రూపులో దోపిడీలే లక్ష్యంగా జరుగుతున్న కార్యక్రమాలు, మహిళ కార్యకర్తలపై ఒత్తిళ్లతో లొంగిపోయినట్టు డీజీపీ వెల్లడించారు.ఇంటర్ చదువుతున్న సమయంలో పీపుల్స్ వార్లో చేరిన సుధాకర్ బెంగళూరు కేంద్రంగా టెక్నికల్ కమిటీలో పనిచేశారు. వివిధ హోదాల్లో విధులు నిర్వర్తించిన ఆయన పలు రాష్ట్రాలకు ఇంఛార్జిగా బాధ్యతలు నిర్వహించారు.