పీఎస్ ఎదుట ఒంటికి నిప్పంటించుకున్న యువకుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు పీఎస్ ఎదుట అర్ధరాత్రి రాజేశ్ అనే యువకుడు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యా యత్నం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దండుమిట్ట తండాకు చెందిన ఆ యువకుడు భార్యతో మనస్పర్ధల నేపథ్యంలో ఈ నెల 15న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనకు న్యాయం జరగడం లేదని భావించి స్టేషన్ వద్దకు చేరుకుని పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. కొద్ది సేపటికి కాలిన గాయాలతో పరుగు పెడుతూ స్థానిక ప్రభుత్వాసుపత్రికి వెళ్లాడు. అక్కడ నుంచి 108 ద్వారా కొత్తగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.