తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

పని అడిగేందుకే వెళ్లాడు.. దాడికి కారణం తెలియలేదు: ఎస్పీ - పేర్ని నానిపై దాడికి యత్నం వార్తలు

ఏపీ మంత్రి పేర్ని నానిపై దాడికి యత్నించిన నిందితుడు.. పని కల్పించమని కోరేందుకే వెళ్లినట్టు పోలీసుల ప్రాథమిక విచారణంలో తేలింది. అయితే మంత్రిపై దాడి ఎందుకు చేశాడో స్పష్టత ఇంకా రాలేదని పోలీసులు తెలిపారు.

పని అడిగేందుకే వెళ్లాడు.. దాడికి కారణం తెలియలేదు: ఎస్పీ
పని అడిగేందుకే వెళ్లాడు.. దాడికి కారణం తెలియలేదు: ఎస్పీ

By

Published : Nov 29, 2020, 8:26 PM IST

ఏపీ మంత్రి పేర్ని నానిపై దాడి యత్నం కలకలం సృష్టించింది. మంత్రిపై భవన నిర్మాణ కార్మికుడు బడుగు నాగేశ్వరరావు దాడికి ప్రయత్నించాడు. ఈ విషయంపై పోలీసులు విచారణ చేపట్టారు. పనులు కల్పించాలని నిందితుడు మంత్రిని కోరేందుకు వచ్చినట్లు ఎస్పీ రవీంద్రనాథ్ తెలిపారు.

ఎందుకు దాడి చేశాడనే విషయమై స్పష్టత ఇంకా రాలేదని ఎస్పీ చెప్పారు. నిందితుడు తమ అదుపులోనే ఉన్నట్లు వెల్లడించారు.

సంబంధిత కథనం:మచిలీపట్నంలో మంత్రి పేర్ని నానిపై దాడికి యత్నం

ABOUT THE AUTHOR

...view details