తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

'ఆర్‌బీఐ అనుమతి లేకుండానే మైక్రో ఫైనాన్స్ సంస్థల నిర్వహణ' - సీపీ అంజనీ కుమార్ వార్తలు

మైక్రో ఫైనాన్స్‌ సంస్థల విషయమై హైదరాబాద్‌లో 3 చోట్ల దాడులు చేసినట్లు సీపీ అంజనీ కుమార్​ వెల్లడించారు. 700 ల్యాప్‌టాప్‌లు సీజ్‌ చేసినట్లు తెలిపారు. మైక్రో ఫైనాన్స్‌ సంస్థల మోసం విషయమై సైబర్‌ సెల్‌ బృందాలు దర్యాప్తు చేస్తున్నాయని పేర్కొన్నారు.

cp anjani kumar
cp anjani kumar

By

Published : Dec 22, 2020, 4:44 PM IST

ఆర్‌బీఐ అనుమతి లేకుండా కొన్ని మైక్రో ఫైనాన్స్ సంస్థలు నడుస్తున్నాయని హైదరాబాద్​ సీపీ అంజనీ కుమార్ తెలిపారు. రుణాలు తీసుకున్న వినియోగదారులను సంస్థలు వేధిస్తున్నాయని పేర్కొన్నారు. మైక్రో ఫైనాన్స్‌ సంస్థల విషయమై హైదరాబాద్‌లో 3 చోట్ల దాడులు చేసినట్లు వివరించారు. కార్పొరేట్‌ కార్యాలయం మాదిరిగా సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయన్నారు. మైక్రో ఫైనాన్స్‌ సంస్థల మోసం విషయమై సైబర్‌ సెల్‌ బృందాలు దర్యాప్తు చేస్తున్నాయని సీపీ వెల్లడించారు.

మైక్రో ఫైనాన్స్‌ సంస్థలో చాలామంది టెలీకాలర్స్‌ పనిచేస్తున్నారు. రోజూ 200 నుంచి 300 మందికి టెలీకాలర్స్‌ ఫోన్లు చేస్తున్నారు. ఇండోనేషియా, చైనాకు చెందిన వ్యక్తులకు సంబంధాలు ఉన్నాయి. మైక్రో ఫైనాన్స్‌ సంస్థలపై దాడులు చేసి 700 ల్యాప్‌టాప్‌లు సీజ్‌ చేశాం. మోసాల విషయమై సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయాలి.

- అంజనీ కుమార్​, హైదరాబాద్ సీపీ

ఇదీ చదవండి :దా‘రుణ’ యాప్‌ల వ్యవహారంలో ఆరుగురి అరెస్ట్‌

ABOUT THE AUTHOR

...view details