అత్తాకోడలి దారుణ హత్య - brutally
శ్రీకాకుళం నగరంలో అత్త, కోడలును గుర్తు తెలియని వ్యక్తులు దారణంగా హత్య చేశారు.
శ్రీకాకుళం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని బొందిలిపురం విజయనగర్ వీధిలో నివాసముంటున్న అత్త,కోడలిను గుర్తు తెలియని వ్యక్తులు హత్యచేశారు. ఆ ఇంటి యజమాని జిలాని ఇంట్లో లేని సమయంలో అతని తల్లి జూరాబాయి, భార్య మెహరున్నీషాను విచక్షణ రహితంగా చంపేశారు. పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన పిల్లలు, తలుపులు ఎంతకొట్టిన తీయకపోయేసరికి జిలాని తమ్ముడు రఫీని తీసుకొచ్చారు. వేరొక తాళంతో తలుపు తెరిచి చూడగా, రక్తపుమడుగులో పడిఉన్న మృతదేహాలు చూసి కన్నీరు మున్నీరయ్యారు.
ఈ ఘటనపై ఇన్‌ఛార్జీ ఎస్పీ పనసారెడ్డి నేతృత్వంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. క్లూస్ టీమ్, జాగిలాల సహాయంతో వివరాలు సేకరిస్తున్నారు.