తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

పిడుగు పాటుకు పశువుల కాపరి మృతి - జామ్ లో పిడుగుపాటుకు వ్యక్తి మృతి

పిడుగుపాటుకు వ్యక్తి మృతిచెందిన ఘటన నిర్మల్ జిల్లా జామ్ గ్రామంలో చోటుచేసుకుంది. ఓ పశువుల కాపరి వర్షం రాగా చెట్టు కింద నిల్చుకున్న సమయంలో పిడుగుపాటుకు గురయ్యాడు.

పిడుగు పాటుకు పశువుల కాపరి మృతి
పిడుగు పాటుకు పశువుల కాపరి మృతి

By

Published : Oct 11, 2020, 12:04 PM IST

నిర్మల్ జిల్లాలో పిడుగుపాటుతో మరో వ్యక్తి మృతి చెందాడు. ఈనెల 1న దిలావర్​పూర్ మండలం కాల్వతండాలో ఓ మహిళా రైతు పిడుగుపాటుకు మృతి చెందగా... తాజాగా ఈరోజు సాయంత్రం సారంగాపూర్ మండలం జామ్ గ్రామానికి చెందిన కామాండ్ల బోజన్న పశువుల కాపరి. వర్షం రావడం వల్ల చెట్టు కింద నిలుచున్నాడు.

ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో పిడుగు పడటం వల్ల బోజన్న అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య ,ఇద్దరు కుమారులు ఉన్నారు.

ఇవీచూడండి:మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో జిల్లాలో మొదటి సూపర్ మార్కెట్

ABOUT THE AUTHOR

...view details