బుల్లితెర నటి ఝాన్సీ ఆత్మహత్య - actress
ఝాన్సీ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమా..?
![బుల్లితెర నటి ఝాన్సీ ఆత్మహత్య](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2373764-107-a833bed0-5dd2-46ba-88b5-81673251adf2.jpg)
బుల్లితెర నటి ఝాన్సీ
హైదరాబాద్ పంజాగుట్ట శ్రీనగర్ కాలనీలో బుల్లితెర నటి ఝాన్సీ ఆత్మహత్యకు పాల్పడింది. శ్రీనగర్ కాలనీలోని తన ఇంట్లో సాయంత్రం ఉరేసుకుంది. ఆమె మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఝాన్సీ మృతికి ప్రేమ వ్యవహారమే కారణంగా తెలుస్తోంది. ఝాన్సీ ఆత్మహత్యపై ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు విచారణ చేపట్టారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Last Updated : Feb 6, 2019, 1:05 PM IST