ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా సాలూరు వద్ద జాతీయ రహదారిపై పోలీసులు విస్తృత తనిఖీలు చేశారు. ఓ వ్యక్తి వాహనంపై వేగంగా వస్తుండగా.. అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అతను వాహనం ఆపకుండా.. ఎస్సై ఫక్రుద్దీన్‌ను ఢీకొట్టి మరీ వేగంగా ముందుకు వెళ్లాడు. ఈ క్రమంలో గొల్లవీధి కూడలి వద్ద వాహనం అదుపు తప్పి ప్రమాదానికి గురయ్యాడు.
ఎస్సైని ఢీకొట్టి పారిపోయే యత్నం.. అయినా సపర్యలు! - Seizure of smuggled marijuana saluru news
ఏపీలోని విజయనగరం జిల్లా సాలూరు దగ్గర.. జాతీయ రహదారిపై ఓ వాహనంలో గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అడ్డుకోబోయారు. ఎస్సైని తన వాహనంతో ఢీ కొట్టిన ఆ వ్యక్తి.. పరారయ్యే క్రమంలో వేగంగా వెళ్లి ప్రమాదానికి గురయ్యాడు. చివరికి.. అదే ఎస్సై వెళ్లి అతనికి సపర్యలు చేశారు. గంజాయిని స్వాధీనం చేసుకుని.. కేసు నమోదు చేశారు.
ఎస్సై మానవత్వం, విజయనగరం
కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలై పడి ఉన్న అతనికి... అదే ఎస్సై ఫక్రుద్దీన్ మానవత్వంతో సపర్యలు చేశారు. నీళ్లు తాగించారు. అతను గంజాయి సరఫరా చేస్తూ.. పరారయ్యేందుకు యత్నించినట్టు గుర్తించారు. 25 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. నిందితుడిని ఒడిశాకు చెందిన దేవేందర్ ఖిల్లో (25)గా గుర్తించారు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి:సీసీ కెమెరాలతో నేరాల నియంత్రణ: డీసీపీ సంప్రీత్ సింగ్
Last Updated : Jan 24, 2021, 1:08 PM IST