తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

అక్రమంగా నిల్వ ఉంచిన 170 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం - గద్వాల తాజా వార్తలు

అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని పోలీసులు, రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్ర పౌర సరఫరా శాఖ ముద్రణతో ఉన్న ఆ బస్తాలు ఎక్కడి నుంచి వచ్చాయనే అంశంపై అధికారులు ఆరా తీస్తున్నారు.

అక్రమంగా నిల్వ ఉంచిన 170 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం
అక్రమంగా నిల్వ ఉంచిన 170 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం

By

Published : Oct 2, 2020, 7:33 PM IST

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని రేఖ రైస్ మిల్లులో అక్రమంగా నిల్వ ఉంచిన 170 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు, రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. తెలంగాణ పౌర సరఫరా శాఖ ముద్రణతో ఉన్న బియ్యం బస్తాలను మిల్లులో గుర్తించారు. అవి ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు తరలించారు అనే అంశంపై అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రాథమిక నివేదిక ప్రకారం ఆ మిల్లులో ఉన్న 340 బియ్యం బస్తాలను, గోదాంను సీజ్ చేస్తున్నట్టు ఎస్సై సత్యనారాయణ తెలిపారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details