తెలంగాణ

telangana

యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా.. 10 ట్రాక్టర్ల పట్టివేత

By

Published : Dec 4, 2020, 12:22 PM IST

ఇసుక అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. అనుమతి లేకుండా అక్రమ రవాణా చేస్తున్న 10 ట్రాక్టర్లను పట్టుకున్నారు. ఇటీవల నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో అక్రమార్కులు రాత్రి వేళలో యథేచ్ఛగా ఇసుక దందాకు పాల్పడుతున్నారు.

seized 10 tractors at yellandu that are moving sand illegally
యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా.. 10 ట్రాక్టర్ల పట్టివేత

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ఇసుక దందాపై పోలీసులు దృష్టి పెట్టారు. అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 10 ట్రాక్టర్లను పట్టుకున్నారు. కొంతకాలంగా ఆగిపోయిన అక్రమ రవాణా.. ఇటీవల నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో అక్రమార్కులు రాత్రి వేళలో యథేచ్ఛగా ఇసుక దందాకు పాల్పడుతున్నారు. ఈ వ్యవహారంలో కొందరు ప్రజాప్రతినిధులు కూడా ఉన్నట్లు ప్రచారం కొనసాగుతోంది.

కొత్తగూడెం-ఇల్లందు రహదారిలో నిత్యం అక్రమ ఇసుక రవాణా జరుగుతుందన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో పోలీసులు నిఘా పెట్టారు. టేకులపల్లి మండలం నుంచి ఎటువంటి అనుమతి పత్రాలు లేకుండా రవాణా చేస్తున్న ఇసుక ట్రాక్టర్లను పట్టుకొన్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చూడండి: రైతులకు శుభవార్త... మక్కల కొనుగోలుకు మార్గం సుగమం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details