వనస్థలిపురం చోరీ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. మంగళవారం ఏటీఎంలో నగుదు నింపే వాహనం నుంచి దొంగలు రూ. 58 లక్షలు ఎత్తుకెళ్లారు. దోపిడీకి పాల్పడింది తమిళనాడులోని తిరుచ్చికి చెందిన ముఠా పనేనని పోలీసులు భావిస్తున్నారు. దొంగతనం తర్వాత దుండగులు పారిపోయిన మార్గాల్లోని సీసీ కెమెరా దృశ్యాలు పరిశీలిస్తున్నారు. చోరీ చేసిన ముఠా కోసం నగరం లోపల, వెలుపల ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.
వనస్థలిపురం చోరీ... తమిళనాడు ముఠా పనేనా? - police
మంగళవారం పట్టపగలు వనస్థలిపురంలో జరిగిన భారీ చోరీ కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. దొంగతనానికి పాల్పడింది తమిళనాడులోని తిరుచ్చికి చెందిన ముఠాగా పోలీసులు అనుమానిస్తున్నారు.
డబ్బు పెట్టేను తీస్తున్న దుండగుడు